లోకల్‌ బ్యాంకుల నుంచి కొందరు కువైటీల తొలగింపు

- October 14, 2020 , by Maagulf
లోకల్‌ బ్యాంకుల నుంచి కొందరు కువైటీల తొలగింపు

కువైట్ సిటీ‌: కువైట్‌ పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌, పలువురు కువైటీ పౌరులను, లోకల్‌ బ్యాంక్స్‌ తొలగించినట్లుగా గుర్తించింది. ఆయా బ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్న కువైట్‌ పౌరుల్ని తొలగించడంపై స్పందించిన కువైట్‌ పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌, ఆయా బ్యాంకులతో ఈ విషయమై చర్చిస్తున్నట్లు పేర్కొంది. కువైటీ పౌరులైన ఉద్యోగుల తొలగింపుకు గల కారణాల్ని తెలుసుకుంటున్నామని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ మేన్‌ పవర్‌ పేర్కొంది. కువైటైజేషన్‌కి వ్యతిరేకంగా ఈ చర్యలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందన్న విషయమై ఆరా తీస్తున్నాయి అథారిటీస్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com