కువైట్:సమస్యలు ఏవైనా మదద్ ద్వారా తెలియజేయాలని కోరిన ఇండియన్ ఎంబసీ
- October 15, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని భారతీయులు..తమ సమస్యలను మదద్ ద్వారా తమ దృష్టికి తీసురావొచ్చని తెలిపింది కువైట్ లోని భారత రాయబార కార్యాలయం. దేశంగానీ దేశంలో భారతీయులకు ఐదేళ్లుగా మదద్ ద్వారా కువైట్ లోని ఇండియన్ ఎంబసీ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. కోర్టు కేసులు, నష్టపరిహారం చెల్లింపులు, జైలు శిక్ష ఎదుర్కుంటున్న వారు, స్వదేశానికి మృతదేహాల తరలింపు, బకాయి జీతాలు, ఏజెంట్ల చేతిలో మోసపోయిన సందర్భాలు, కనిపించకుండా పోయిన వ్యక్తుల గురించి ఆరా తీయటం..ఇలాంటి సమస్యలు ఉంటే మదద్ ద్వారా భారత రాయబార కార్యాలయాన్ని ఆశ్రయించవచ్చు. ఆ తర్వాత సమస్యను తెలుసుకొని భారతీయులకు ఎంబసీ అధికారులు తమ పరిధిలో సాయం అందిస్తారు. విదేశాల్లో ఉండే భారతీయులు తమ సమస్యలు చెప్పుకొని తగిన సాయం పొందెందుకు ఉండేందుకు 2015లో భారత విదేశాంగ శాఖ మదద్ వెబ్ సైట్ ను ప్రారంభించింది. http://www.madad.gov.in ద్వారా ప్రవాసీయులు తమ సమస్యను
చెప్పుకోవచ్చు. ప్రవాసీయులకు మరింత వేగంగా మదద్ సేవలు అందించేందుకు మదద్ మొబైల్ యాప్ ను కూడా ప్రారంభించారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన