కొత్త పాస్ పోర్టుల్లేవ్..పాతవారికే పాస్ పోర్టుల పునరుద్ధరణ..NRIలకు సూచన

- October 15, 2020 , by Maagulf
కొత్త పాస్ పోర్టుల్లేవ్..పాతవారికే పాస్ పోర్టుల పునరుద్ధరణ..NRIలకు సూచన

అబుధాబి:ఇండియన్లకు పాస్ పోర్టుల జారీ విషయంలో అబుధాబిలోని భారత రాయబార కార్యాలయం స్పష్టతనిచ్చింది. ఇప్పటికే పాస్ పోర్టు గడువు ముగిసిన వారు, రెసిడెన్సీ గడువు ముగిసినవారు..లేదంటే నవంబర్ 30తో గడువు ముగిసే వారికి మాత్రమే పాస్ పోర్టులను పునరుద్ధరించనున్నట్లు కార్యాలయ అధికారులు చెబుతున్నారు. కేవలం వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలించనున్నట్లు తెలిపారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే..ఎవరికైన అత్యవసరంగా పాస్ పోర్టు పొందాల్సిన అవసరం ఉంటే..వారు పాస్ పోర్టు దరఖాస్తుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్లను స్కాన్ చేసి..ఏ అత్యవసర పని కోసం పాస్ పోర్టు కోరుతున్నారో వివరిస్తూ లేఖను జతపరిచి [email protected].కి మెయిల్ చేయాలని రాయబార కార్యాలయం తెలపింది. మెయిల్ కు వచ్చే ప్రతి దరఖాస్తును తాము విధిగా పరిశీలిస్తామని, అవసరం ఉందనుకుంటే వారికి ఎంబసీ తరపున తగిన సహాయ సహాకారాలు అందిస్తామని వెల్లడించింది. పాస్ పోర్టు దరఖాస్తు సూచనలను ఇండియన్లు గమనించి అధికారులకు సహకరించాలని కార్యాలయ అధికారులు కోరారు. 

--సుమన్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com