ఒక్క ఉంగరంలో 7,801 వజ్రాలు
- October 25, 2020
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన ఓ నగల వ్యాపారి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు.ఒక్క ఉంగరంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7,801 డైమండ్స్ ని పొదిగారు. దీంతో ఆ రింగ్ గిన్నీస్ వాల్డ్ రికార్డ్ లోకి ఎక్కింది.ది డైమండ్ స్టోర్ బై చందూభాయి యజమాని కొట్టి శ్రీకాంత్ హైదరాబాద్ జూబ్లీ హిల్స్‌లో 'ది డివైన్-7801 బ్రహ్మ వజ్ర కమలం' పేరుతో ఈ ఉంగరాన్ని తయారు చేశారు. ఈ పుష్పాన్ని ఆ వ్యాపారి అరుదుగా దొరికే బ్రహ్మ కమలాన్ని మోడల్ గా తీసుకుని రూపొందించారు.అయితే ఆ రింగ్ ను గత నెలలోనే ఆవిష్కరించారు.
మొదట ఈ ఉంగరాన్ని తయారు చేయాలన్న కాన్సెప్ట్‌ను 2018 సెప్టెంబర్‌లో రూపొందించారు. కేవలం ప్లానింగ్‌కే 45 రోజుల సమయం పట్టింది. అప్పుడు అది కేవలం పెన్సిల్ డ్రాయింగ్ మాత్రమే. ఆ తర్వాత ఉంగరం తయారు చేసే పని మొదలుపెట్టారు. 2019 మార్చి నాటికి రింగ్ బేస్ తయారైంది. ఈ ఉంగరాన్ని తయారు చేసేందుకు 11 నెలల సమయం పట్టగా గతేడాది ఆగస్ట్ నాటికి రింగ్ తయారైంది. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ పని మొదలైంది. ఈ ఉంగరం ఆరు లేయర్స్‌తో ఉంటుంది. ప్రతీ లేయర్లో 8 రేకులు ఉంటాయి. మొత్తం ఉంగరంలో 7801 వజ్రాలున్నాయి. అయితే ఈ ఉంగరం పూర్తిగా తయారైన తరువాత దాన్ని గత ఏడాది గిన్నీస్ వాల్డ్ రికార్డ్ కోసం ఈ ఉంగరాన్ని సబ్మిట్ చేశారు. కాగా ఆ ఉంగరాన్ని అనేక రౌండ్లు వెరిఫికేషన్ చేసి డైమండ్స్ పొదిగిన ఉంగరాన్ని గిన్నీస్ రికార్డ్ లో చేర్చారు.

తాజా వార్తలు
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్
- కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి..
- విమానాల రద్దు పై వస్తున్న వార్తలు అవాస్తవం.. సాధారణంగానే సేవలు: కువైట్ ఎయిర్వేస్
- డిసప్పియర్ ఇంక్‌తో చెక్కు.. ఓ అరబ్ వ్యక్తికి షాకిచ్చిన దుబాయ్ కోర్టు..!!
- కువైట్ లో బాటిల్ వాటర్ కొనుగోలుపై పరిమితి కొనసాగింపు..!!
- ఉగ్రవాద ముఠా అరెస్ట్ పై కువైట్ హోంశాఖ క్లారిటీ..!!
- 7రోజుల్లో 18 వేల ఎక్స్ పైరీ ఉత్పత్తులు స్వాధీనం..!!
- జీ20 ఫాస్టెస్ట్ మొబైల్ ఇంటర్నెట్ దేశాల్లో సౌదీకి చోటు..!!
- బహ్రెయిన్ లో విదేశీ వైద్యుల ఆపరేషన్లపై కఠిన నిబంధనలు..!!
- చక్కెర పానీయాల ఎక్సైజ్ పన్నుపై టాక్స్ అథారిటీ క్లారిటీ..!!







