మార్చ్‌ 12న 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్...

- February 14, 2016 , by Maagulf
మార్చ్‌ 12న 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో ఫంక్షన్...

'సర్దార్ గబ్బర్ సింగ్' షూటింగ్ ఒకవైపు శరవేగంగా జరుగుతున్న నేపధ్యంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన వార్తలు లీక్ అవుతున్నాయి. ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే హైదరాబాద్‌ లో మరో షెడ్యూల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మార్చి మొదటి వారానికి షూటింగ్ పూర్తి చేసి మార్చి రెండవ వారంలో మార్చ్‌ 12న ఈ సినిమా ఆడియోను అత్యంత ఘనంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ ఆడియో ఫంక్షన్ ను మెగా కుటంబ పవర్ చాటే విధంగా అత్యంత భారీ స్థాయిలో దాదాపు లక్ష మంది అభిమానుల మధ్య హైదరాదాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించడానికి అప్పుడే ఏర్పాట్లు మొదలు అయ్యాయి అన్న వార్తలు వస్తున్నాయి.1.50 కోట్ల ఖర్చుతో నిర్వహించనున్న ఈఈవెంట్ కు సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రముఖ ఈవెంట్ మేనేజిమెంట్ సంస్థలతో ఈసినిమా నిర్మాత శరత్ మరార్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ చేయబోయే హంగామా ఈ ఆడియో ఫoక్షన్ కు హైలెట్ గా మారుతుందని అంటున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ లో దేవిశ్రీ స్టేజ్ షో పవన్ అభిమానులకు కిక్ ఇవ్వడం ఖాయం అని అంటున్నారు. ఇప్పటికే ఈ ఆడియో వేడుకకు చిరంజీవితో పాటు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరవుతారు అని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంత భారీ స్థాయిలో ఈ ఆడియో వేడుకకు డబ్బు ఖర్చు పెట్టడం వెనుక ఒక బిజినెస్ సీక్రెట్ ఉంది అని అంటున్నారు. ఈ ఆడియో ఫంక్షన్ కు సంబంధించిన టెలికాస్ట్ రైట్స్ ను ఒక ప్రముఖ ఛానల్ కు భారీ మొత్తానికి అమ్మడంతో పాటుగా అనేక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీల యాడ్స్ ను కూడ రాబట్టుకునే అవకాశంగా ఈ 'సర్దార్ గబ్బర్ సింగ్' ఆడియో వేడుక మారబోతోంది అని టాక్..

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com