కువైట్-భారత్ మధ్య వాణిజ్య, ఆర్ధిక సంబంధాల బలోపేతంపై చర్చ

- October 27, 2020 , by Maagulf
కువైట్-భారత్ మధ్య వాణిజ్య, ఆర్ధిక సంబంధాల బలోపేతంపై చర్చ

కువైట్ సిటీ:కువైట్ తో పలు రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై దృష్టిసారించిన భారత్..ఇప్పటికే పలు శాఖల మంత్రలతో చర్చలు జరిపింది. తాజాగా కువైట్ వాణిజ్య, ఆర్ధిక చాంబర్ డైరెక్టర్ జనరల్ తో కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జ్ సమావేశం అయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య, ఆర్ధిక పరమైన సంబంధాలు మరింత బలోపేతం అయ్యే దిశగా చర్చలు జరిపారు. పారిశ్రామికాభివృద్ధికి పరస్పరం సహరించుకునే అంశాలపై ఈ భేటీలో డిస్కస్ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కువైట్ లో పలు భారతీయ కంపెనీలు తమ సంస్థ శాఖలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఎల్&టీ, షాపూర్జీ పల్లోంజీ, కల్పతరు పవర్ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్, టీఈఆర్ఐ, ఎస్సార్ ప్రాజెక్ట్స్, సింప్లెక్స్ ప్రాజెక్ట్స్ లాంటి ఈపీసీ తరహా కంపెనీలతో పాటు టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా వంటి ఐటీ సంస్థలు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com