ఆస్ట్రేలియా టూర్ కి భారత జట్ల ఎంపిక..
- October 27, 2020
ఆస్ట్రేలియా పర్యటన కోసం వన్డే, టీ20, టెస్టు జట్లను బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ మ్యాచ్ ల కోసం ఐపీఎల్లో కండరాల గాయం వల్ల గత రెండు మ్యాచ్‌లకు దూరమైన రోహిత్ శర్మతో పాటు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ లను సునీల్ జోషి నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. పరిమిత ఓవర్ల సిరీస్ ల్లో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ స్థానంలో లోకేష్ రాహుల్ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
రోహిత్ స్థానంలో మయాంక్ అగర్వాల్ వన్డే, టీ20 జట్లలో చోటు దక్కించుకోగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున అదరగొడుతున్న లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి తొలి సారి జాతీయ జట్టులో స్థానం కల్పించింది. అయితే కొవిడ్-19 నేపథ్యంలో బయో బబుల్ ను దృష్టిలో పెట్టుకొని సెలెక్షన్ కమిటీ జంబో జట్లను ప్రకటించింది. ఐపీఎల్ అనంతరం సిడ్నీ వెళ్లనున్న భారత జట్టు అక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి నవంబర్ 27న తొలి వన్డే ఆడనుందన్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్‌లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్‌లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్‌గా చాట్‌జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్‌ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







