యూఏఈ: పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం పోలీస్ వెరిఫికేషన్..

- October 28, 2020 , by Maagulf
యూఏఈ: పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం పోలీస్ వెరిఫికేషన్..

యూఏఈ:ఇక నుంచి పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం పోలీస్ వెరిఫికేషన్ విధానాన్ని మళ్లీ అమలు చేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. విదేశాల్లో ఉంటున్న ప్రవాస భారతీయులు తమ పాస్ పోర్టు రెన్యూవల్ చేసుకోవాలంటే..వారికి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ లేదని పోలీసులు ధృవీకరించాల్సి ఉంటుంది.ఈ మేరకు తమకు విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి తమకు అంతర్గత మార్గనిర్దేశకాలు అందినట్లు దుబాయ్ లోని దౌత్య కార్యాలయం వెల్లడించింది. సెప్టెంబర్ లో పాస్ పోర్ట్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నవారంతా పోలీస్ వెరిఫికేషన్ ఎదుర్కొవాల్సి వస్తుందని సిద్దార్థ కుమార్ బారైలీ కాన్సుల్(పాస్పోర్ట్ & అటెస్టేషన్) తెలిపారు. అయితే..పోలీస్ వెరిఫికేషన్ ను రెండు విధాలు ఉండనుంది. ఒకటి..పాస్ పోర్టు జారీ చేయకముందే వెరిఫికేషన్ ఉంటుంది. రెండోది...పాస్ పోర్టు జారీ అయిన తర్వాత వెరిఫికేషన్ చేయించటం. పాస్ పోర్టు పోగొట్టుకున్న వారు..గత ఐదేళ్ల కాలంలో తరచుగా యూఏఈ విడిచి వెళ్తున్న వారికి పాస్ పోర్టు జారీ చేసే ముందే పోలీస్ వెరిఫికేషన్ ఉంటుంది.

సిద్దార్థ కుమార్ బారైలీ కాన్సుల్(పాస్పోర్ట్ & అట్టేస్తాషన్)

అయితే.. ప్రస్తుతం పాస్ పోర్టు రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 90 శాతం మందికి పాస్ పోర్టులు జారీ చేశామని సిద్దార్థ కుమార్ తెలిపారు.వాళ్లందరి క్రిమినల్ రికార్డ్ ఉందా లేదా అనేది పోలీసులు నిర్ధారిస్తారని, ఒకవేళ తమ విచారణలో పోలీసులు అభ్యంతరాలు వ్యక్తం చేసే మాత్రం సదరు పాస్ పోర్టుదారుడు దౌత్య కార్యాలయానికి వచ్చి సంజాయిషీ చెప్పుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇదిలాఉంటే..పాస్ పోర్టు గడువు ముగిసే రెండు మూడు వారాలకు ముందే రెన్యూవల్ కు దరఖాస్తు చేసుకోవాలని సిద్దార్థ కుమార్ సూచించారు.ఎందుకంటే ప్రాంతాలను బట్టి పోలీస్ వెరిఫికేషన్ రెండు మూడు రోజుల నుంచి రెండు మూడు వారాలు పట్టొచ్చని చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎమ్ పాస్ పోర్టు యాప్ అందుబాటులో ఉండటంతో పోలీసు విచారణ రెండు మూడు రోజుల్లో పూర్తి అవుతోందని, యాప్ లేని ప్రాంతాల్లో ఎక్కువ సమయం పడుతోందని, పైగా కోవిడ్-19 నేపథ్యంలో వెరిఫికేషన్ కు ఒక్కోసారి రెండు మూడు వారాలు పడుతోందని వివరించారు. అందుకే పాస్ పోర్టు గడువు ముగియకముందే రెండు మూడు వారాల ముందు దరఖాస్తు చేసుకోవాలని ప్రవాసీయులకు సూచించారు. 

కాన్సులేట్ నుండి ముందస్తు అనుమతి లేకుండా పాస్పోర్ట్ గడువు ముగియడానికి ఒక సంవత్సరం వరకు ప్రవాసీయులు పునరుద్ధరణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి మేము అనుమతిస్తున్నాము.వారు ఆలస్యం చేస్తే, తత్కాల్ పాస్పోర్ట్ కోసం ప్రవాసీయులు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో పాస్పోర్ట్ కావాలంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. తత్కాల్ పాస్‌పోర్ట్‌ను దరఖాస్తుదారులు భరించలేని వారు నిజమైన అత్యవసర పరిస్థితుల్లో, వారు సహాయం కోసం [email protected] వద్ద కాన్సులేట్‌కు రాయవచ్చు. కాన్సులేట్ యొక్క పాస్పోర్ట్ విభాగం ఇప్పుడు శనివారం కూడా పనిచేస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com