సముద్రంలో తప్పిపోయిన ఫిషర్‌మెన్‌ దొరికారు

- February 14, 2016 , by Maagulf
సముద్రంలో తప్పిపోయిన ఫిషర్‌మెన్‌ దొరికారు

ముగ్గురు భారతీయ వలస ఫిషర్‌మెన్‌ సముద్రంలో తమ బోటుతో సహా గల్లంతయిన ఘటన ఆందోళన కలిగించింది. అయితే ఆ ముగ్గురినీ క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. గత మంగళవారం తప్పిపోయిన వీరిని నిన్న రక్షించారు. బోట్‌ కెప్టెన్‌ జస్టిన్‌, ఫిషర్‌మెన్‌ ముత్క్కులి పిచాయ్‌, తమిళ మారన్‌ సముద్రంలో తప్పిపోగా, కోస్ట్‌గార్డ్‌ సహకారంతో మూడు ఫిషింగ్‌ బోట్స్‌ వారి ఆచూకీ కోసం తీవ్రంగా ప్రయత్నించి, వారిని కనుగొన్నారు. సుమారు 500 మంది ఫిషర్‌మెన్‌ సిట్రాలో పనిచేస్తుంటారు. ఇందులో చాలామంది భారతదేశంలోని తమిళనాడుకు చెందినవారు. బోట్‌ ఇంజిన్‌ పాడయినట్లుగా తమకు సమాచారం లభించడంతో అధికారులకు సమాచారమిచ్చినట్లు తమిళ మారన్‌ తండ్రి చెప్పారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ఫిషర్‌మెన్‌ జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com