దుబాయ్:సామూహిక వేడుకలు, సెలబ్రేషన్స్ నిర్వహణపై మార్గనిర్దేశకాలు జారీ

- October 29, 2020 , by Maagulf
దుబాయ్:సామూహిక వేడుకలు, సెలబ్రేషన్స్ నిర్వహణపై మార్గనిర్దేశకాలు జారీ

దుబాయ్:రాబోయే కాలంలో వచ్చే పండుగలు, ఇతర సామూహిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి దుబాయ్ విపత్తుల నిర్వహణకు చెందిన సుప్రీం కమిటీ కొత్త మార్గనిర్దేశకాలను జారీ చేసింది. రాబోయే హాలోవీన్ తో దీపావళి పండగ సంబరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, కోవిడ్ నిబంధనలు అన్ని పాటిస్తూ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించింది. కోవిడ్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది సమాజంలోని ఇతర ప్రజల ఆరోగ్యానికి హానీ చేయటమేనని సుప్రీం కమిటీ అభిప్రాయ పడింది. సామూహిక కార్యక్రమాలకు వీలైనంత వరకు వెళ్లకపోవటమే మంచిదని..ఒకవేళ వెళ్లాల్సి వస్తే తప్పకుండా ఫేస్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాల్సిందేనని వెల్లడించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించొద్దని హెచ్చరించింది. ఇక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు సామూహిక కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సుప్రీం కమిటీ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com