కువైట్:అక్రమ మార్కెట్లను నిర్వహిస్తున్న 100 మంది ప్రవాసీయుల అరెస్ట్

- October 30, 2020 , by Maagulf
కువైట్:అక్రమ మార్కెట్లను నిర్వహిస్తున్న 100 మంది ప్రవాసీయుల అరెస్ట్

కువైట్ సిటీ:వీధి వ్యాపారాలను, అక్రమంగా నిర్వహిస్తున్న తాత్కాలిక మార్కెట్లను అరికట్టడంపై కువైట్ అధికారులు ఫోకస్ చేశారు. పలు చోట్ల తనిఖీలు నిర్వహించి వీధి పక్కల, నివాస ప్రాంతాల్లో తాత్కాలిక మార్కెట్లు నిర్వహిస్తున్న 100 మంది ప్రవాసీయులను అధికారులు అరెస్ట్ చేశారు. మానవ వనరులు, కువైట్ మున్సిపాలిటీ, ఇమ్మిగ్రేషన్ విభాగం అధికారులు సంయుక్తంగా ఈ తనిఖీలు నిర్వహించారు. వీధుల్లో కూరగాయలు, పండ్ల మార్కెట్ల సంఖ్య పెరుగుతుండటంతో వాటిని అదుపు చేసేందుకు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న మార్కెట్లపై పెద్ద ఎత్తున తనీఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే అనుమతి లేకుండా మార్కెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. బేకరిలు, రెస్టారెంట్లను కూడా అక్రమంగా నిర్వహిస్తున్నారని అన్నారు.  కొన్ని సంవత్సరాలుగా వీధి వ్యాపారాలను కొనసాగుతున్నాయి. అయితే..సూపర్ మార్కెట్లు, షోరూంలలో ఉండే ధరల కంటే తక్కువ ధరలోనే అమ్మకాలు జరుగుతుండటంతో కార్మికులు, ప్రవాసీయులు కూడా వీధి వ్యాపారుల దగ్గరే వస్తువులు, కూరగాయలు, దుస్తులు కొంటున్నారు. కానీ, అనుమతి లేని వ్యాపారులను అరికట్టేందుకు కొన్నాళ్లుగా అధికారులు వరుస దాడులు చేపడుతున్నారు. కొన్నాళ్ల క్రితమే జ్లీబ్ అల్ సుయౌఖ్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి 75 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇప్పుడు వఫ్ర, కెబద్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి అక్రమంగా మార్కెట్లు నిర్వహిస్తున్న వంద మంది ప్రవాసీయులను అదుపులోకి తీసుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com