నవంబర్ నుంచి ప్రభాస్ నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్..

- February 16, 2016 , by Maagulf
నవంబర్ నుంచి  ప్రభాస్  నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్..

గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో కాలం గడిపేస్తున్న ప్రభాస్ ఫైనల్ గా మరో సినిమాకు ముహుర్తం సెట్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే స్టార్ట్ చేయాల్సిన సినిమాను ఎట్టకేలకు బాహుబలి 2 షూటింగ్ పూర్తయిన తరువాత మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్టురెడీగా ఉన్న దర్శకుడు సుజిత్, ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు.ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఆ సినిమాను పూర్తిచేయాలని భావిస్తున్నాడు. రాజమౌళి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా ప్రభాస్ పార్ట్ ముగించేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నవంబర్ నుంచి తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు బాహుబలి.రన్ రాజా రన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుజిత్ చాలాకాలంగా ప్రభాస్ తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్, ప్రభాస్, సుజిత్ కాంబినేషన్ లో సినిమాను నిర్మించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com