సామ్ జామ్ లో రౌడీ హీరో రచ్చ

- November 10, 2020 , by Maagulf
సామ్ జామ్ లో రౌడీ హీరో రచ్చ

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది సమంత.తెలుగులో 'ఏ మాయ చేసావే' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ఆ తర్వాత తన అందం, అభినయంతో.. చక్కటి నటనతో అందరిని ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లోని అగ్ర హీరోలందరితో నటించింది సమంత. ఇక మన అక్కినేని వారసుడు అయిన నాగ చైతన్య ను ప్రేమించి.. ఇరు కుటుంబాలను ఒప్పించి మరి చైతూ ని పెళ్లాడింది సమంత. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణిస్తూ ముందుకు వెళ్తోంది. ఇక ఇటీవలే కొన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి అందర్నీ ఆశ్చర్య పరిచింది. ఇక తాజాగా సమంత.. శర్వానంద్ తో కలిసి 'జాను' సినిమాలో నటించింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. కానీ సినిమాలో సమంత నటనకి మంచి మార్కులే పడ్డాయి. ఇక వివాహం తర్వాత కూడా తన కెరీర్‌పై దృష్టి సారించి దూసుకుపోతోంది అక్కినేని వారి కోడలు సమంత. సినిమాలు మాత్రమే కాకుండా డిజిటల్ మాధ్యమంపై కూడా దృష్టి సారించింది. ప్రముఖ ఓటీటీ `ఆహా` కోసం `సామ్ జామ్` పేరుతో ఓ స్పెషల్ టాక్ షోను హోస్ట్ చేస్తోంది.ఈ టాక్ షో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సారధ్యంలో జరగనుంది. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించి వారిని ఇంటర్వ్యూ చేయనుంది సమంత.ఇప్పటికే ఈ కార్యక్రమం షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. తాజాగా ఈ కార్యక్రమానికి టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.

సిల్వర్ కలర్ సూట్‌తో స్టైలిష్‌గా ఉన్న విజయ్ ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. త్వరలో మరింత మంది ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి ఈ కార్యక్రమం అందుబాటులోకి రానుంది.ఇక ఈ టాక్ షో లోని మొదటి ఎపిసోడ్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.ఇదిలా ఉంటె తాజాగా సమంతా 'ద ఫ్యామిలీ మ్యాన్ సీసన 2' అనే వెబ్ సీరీస్ లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. ప్రముఖ ఓ. టి.టి.ప్లేట్ ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో ఈ వెబ్ సీరీస్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com