సెకనుకు 10 గిగాబైట్ల వేగంతో నెట్ స్పీడ్..

- February 16, 2016 , by Maagulf
సెకనుకు 10 గిగాబైట్ల వేగంతో నెట్ స్పీడ్..

ఇంటర్ నెట్ వాడకం ఈ మద్య బాగా పెరిగిపోవడం తో , ఇప్పుడు అతి తక్కువ ఖర్చు తి మీ ఇంట్లో హైస్పీడ్ నెట్ వాడుకోవచ్చు అని అంటున్నారు యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ (యూసీఎల్) పరిశోధకులు.ప్రతి ఇంట్లో వారి బడ్జెట్ తగ్గట్టు ఖర్చు తో హైస్పీడ్ నెట్ వాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశామని వీరు చెపుతున్నారు. దీనివల్ల నెట్ కనెక్షన్, నెట్ స్పీడ్ వంటి వాటితో ఎదుర్కొంటున్న ఇబ్బందులకు పరిష్కారం సులభంగా లభించినట్లేనని వెల్లడించారు.ఈ సందర్భంగా పరిశోధకుడు సీజర్ ఎర్కి లింక్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ కనెక్షన్ ఖరీదు ఎక్కువగా ఉండడానికి గల కారణం రిసీవర్ లేనని, అందుకే తక్కువ ఖర్చుతో నెట్ వేగాన్ని, నాణ్యతను పెంచే కొత్త రిసీవర్ ను రూపొందించామని తెలిపాడు.అంతేకాకుండా ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాపర్ కేబుల్ ద్వారా నెట్ వేగం సెకనుకు 300 మెగాబైట్స్ ఉంటుందని, ఇప్పుడు కొత్త రిసీవర్ ద్వారా సెకనుకు 10 గిగాబైట్ల వేగంతో నెట్ స్పీడ్ సాధ్యమవుతుందని ఈ సందర్భంగా చెప్పాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com