కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన ముఖ్యమంత్రులు..
- November 16, 2020
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయ ద్వారాలు మూసివేయక ముందే అక్కడ విపరీతంగా మంచు కురవడం ప్రారంభమయ్యింది. దీంతో కేదార్నాథ్ ఆలయ ప్రాంతమంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారిపోయింది. చలి విపరీతంగా పెరిగిపోయింది. ఇదేవిధంగా గంగోత్రిథామ్లోనూ భారీగా మంచు కురుస్తోంది. గంగోత్రిథామ్ తలుపులను మూసిన వెంటనే ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. గంగాఘాటీ తీరమంతా మంచుతో నిండిపోయింది.
కేదార్నాథ్ ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అక్కడే చిక్కకుపోయారు. ముఖ్యమంత్రులిద్దరూ హెలికాప్టర్లో తిరుగు ప్రయాణం కావాల్సివుంది. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా హెలికాప్టర్ సేవలు నిలిపివేశారు. దీంతో వాతావరణం సాధారణ స్థితికి వచ్చేవరకూ హెలికాప్టర్ సేవలు కొనసాగించే అవకాశం లేదు. ఉత్తరభారతంలోని పలు ప్రాంతాలలో ఉన్నట్టుండి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లలో విపరీతంగా మంచు కురుస్తోంది.
हर हर महादेव... pic.twitter.com/sYp1PRY4I1
— Yogi Adityanath (@myogiadityanath) November 16, 2020
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!