టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో అనగనగా ఓ అతిధి
- November 16, 2020
హైదరాబాద్:ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతకాం పై టాలెంటెడ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చిత్రం అనగనగా ఓ అతిధి. ఈ సినిమాలో పాయల్ తో పాటు యువ కథనాయకుడు చైతన్య కృష్ణ, నటులు ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్ తదితరలు కీలక పాత్రల్లో నటించారు. దయాల్ పద్మనాభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రాన్ని రాజా రామ్ మూర్తి, చిదంబరం నటీసన్ నిర్మించారు. అనుకోని పరిస్థితుల్లో ఓ అర్ధరాత్రి ఓ ఇంటికి వచ్చిన అతిధి కారణంగా ఎదురైయ్యే సమస్యలు కథాంశంగా ఈ సినిమాను దర్శకుడు దయాల్ అత్యంత ఉత్కంఠ కలిగేలా రూపొందిచారు. ఆరెక్స్ 100 వంటి బ్లాక్ బస్టర్ హిట్, ఆర్ డి ఎక్స్ లవ్, డిస్కోరాజా సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ సోంత ఇమేజ్ తెచ్చుకున్న పాయల్ ఇప్పుడు అనగనగా ఓ అతిధితో మరోసారి ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేయడానికి రెడీ అవుతుంది. ఈ సినిమా డైరెక్ట్ రిలీజ్ స్లేట్ లో ప్రముఖ తెలుగు ఓటిటి ఆహాలో నవంబర్ 20న విడుదల అవుతుంది.
నటీనటులు - పాయల్ రాజ్ పుత్, చైతన్య కృష్ణ, ఆనంద్ చక్రపాణి, వీణ సుందర్
దర్శకుడు - దాయల్ పద్మనాభన్
ప్రొడక్షన్ హౌస్ - ట్రెండ్ లౌడ్ డిజిటిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
సినిమాటోగ్రాఫర్ - రాకేష్ బి
ప్రొడ్యూసర్స్ - రాజా రామామూర్తి, చిందబర్ నటీశన్
మ్యూజిక్ డైరెక్టర్ - ఆరోల్ కోరెల్లి
రైటర్ - కాశీ నదీంపల్లి
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన