మస్కట్ లో బీచ్ లలో కుటుంబాలతో గడిపేవారికి ప్రత్యేక ప్రాంతాలు
- February 17, 2016
ఆకతాయిల నుంచి ఇబ్బందులు ఎదురు కాకుండా... ఏకాంతం భంగపదకుండా ఉండేందుకు మస్కట్ సముద్రతీరాల్లో కుటుంబాలతో సేద తీరే వారికి మునిసిపాలిటి ప్రతేక ఏర్పాట్లు చేసింది. బుషేర్ , కురియత్ , సీబ్ ప్రాంతాలలోని 6 బీచ్ లలో ..కేవలం కుటుంబ సభ్యులథొ గడిపేవారికి మాత్రమె ఇక్కడ అనుమతిస్తారు. ఇక ధూమపానంకు అనుమతి లేదు. అదే విధంగా కార్లలో బైకులతో ఈ ప్రాంతంలో చక్కర్లు కొట్టకూడదని మున్సిపాలిటీ ఉన్నతాదికారి ఒమాన్ టైమ్స్ కు తెలిపారు. సముద్రతీరంలో కుటుంబంతో సంతోషంగా గడిపేవారికి శుభవార్త కాగా, సముద్రపు ఒడ్డున అల్లరి చిల్లర చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షించబడాలనుకొనే కొంతమంది కుర్ర గ్యాంగులకు ఇది మింగుడుపడని నిర్ణయం. 600మీటర్ల నుంచి 1000 మీటర్ల వరుకు కుటుంబాలకు కేటాయిస్తారు. కుటుంబాలతో బీచ్ లకు వెళుతుంటే, కొంతమంది ఇబ్బందులు కల్గిస్తున్నారని పలు పిర్యాదులు తమకు అందిన నేపద్యంలో మస్కట్ మునిసిపాలిటి అధికారులు కుటుంబాలతో గడిపేవారికి ప్రత్యేక ప్రాంతాలు ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









