140,000 దాటిన కువైట్‌ కోవిడ్‌ కేసులు

- November 23, 2020 , by Maagulf
140,000 దాటిన కువైట్‌ కోవిడ్‌ కేసులు

కువైట్ సిటీ:కువైట్‌లో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 140,056గా నమోదయ్యింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ తాజాగా వెల్లడించింది. కొత్తగా నిన్న 322 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇదిలా వుంటే, ఇప్పటిదాకా కరోనాతో 866 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఇరవై నాలుగ్గంటల్లో కరోనాతో మరణించినవారి సంఖ్య 3. మరోపక్క, కరోనా నుంచి 132,178 మంది కోలుకోగా, నిన్న ఒక్కరోజే 618 కోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,012. 86 మంది ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో మొత్తం 4,099 కరోనా టెస్టులు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,052,001కి చేరుకుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com