140,000 దాటిన కువైట్ కోవిడ్ కేసులు
- November 23, 2020
కువైట్ సిటీ:కువైట్‌లో ఇప్పటిదాకా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 140,056గా నమోదయ్యింది. ఈ విషయాన్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తాజాగా వెల్లడించింది. కొత్తగా నిన్న 322 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇదిలా వుంటే, ఇప్పటిదాకా కరోనాతో 866 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన ఇరవై నాలుగ్గంటల్లో కరోనాతో మరణించినవారి సంఖ్య 3. మరోపక్క, కరోనా నుంచి 132,178 మంది కోలుకోగా, నిన్న ఒక్కరోజే 618 కోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 7,012. 86 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో మొత్తం 4,099 కరోనా టెస్టులు చేశారు. దీంతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 1,052,001కి చేరుకుంది.
తాజా వార్తలు
- ఆంధ్ర ప్రదేశ్: శాసనసభ రేపటికి వాయిదా
- వందేమాతరం పూర్తి వెర్షన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం కొత్త రూల్స్
- భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- పలువురు మంత్రులను చంపేస్తామంటూ బెదిరింపులు: మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రభుత్వ వేతన సహాయం దుర్వినియోగం..జైలుశిక్ష, జరిమానాలు..!!
- ఎలక్ట్రిక్ హై-స్పీడ్ రైల్వే లింక్.. సౌదీ కేబినెట్ ఆమోదం..!!
- మెడికల్ సిటీ.. 3,000 మంది విద్యార్థులు..1,000 ఉద్యోగాలు..!!
- గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోకి ఖతార్ జాతీయ క్రీడా దినోత్సవం..!!
- కువైట్ లో ఆన్లైన్ సర్వీసును ప్రారంభించిన ఫైర్ ఫోర్స్..!!
- ఒమన్‌లో రమదాన్ వర్కింగ్ అవర్స్ వెల్లడి..!!









