అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ..సౌదీ అరేబియా ప్రకటన

- November 24, 2020 , by Maagulf
అందరికీ కరోనా వ్యాక్సిన్ ఫ్రీ..సౌదీ అరేబియా ప్రకటన

రియాద్:కింగ్డమ్ పరిధిలోని దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించనున్నట్లు సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రకటించింది. దేశ ప్రజల ఆరోగ్య సంక్షరణను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వ్యాక్సిన్ సరఫరా చేస్తోందని, ప్రజలకు వ్యాక్సిన్ ను అందించటాన్ని వ్యాపారంగా తాము భావించటం లేదని సౌదీ ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ అబ్దుల్లా అల్ అసిరి వెల్లడించారు. వచ్చే ఏడాది చివరినాటికి దేశవ్యాప్తంగా 70 శాతం మంది ప్రజలకు వ్యాక్సిన్ అందించగలమని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే..వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ప్రధాన్యత క్రమంలో ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 16 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ అందించకపోవటమే ఉత్తమమని భావిస్తున్నట్లు తెలిపారు. జీ20 సభ్య దేశాల్లో దేశ ప్రజల ఆరోగ్యానికి సంబంధించి సమర్ధవంతమైన చర్యల్లో సౌదీ అరేబియా ఒకటని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com