కోవిడ్ ఎఫెక్ట్: మసీదుల్లో ఫ్రైడే ప్రార్ధనలను పది నిమిషాలకు కుదించిన యూఏఈ

- November 25, 2020 , by Maagulf
కోవిడ్ ఎఫెక్ట్: మసీదుల్లో ఫ్రైడే ప్రార్ధనలను పది నిమిషాలకు కుదించిన యూఏఈ

యూఏఈ:కోవిడ్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం ప్రార్థనలను నిలిపివేసిన యూఏఈ ఆరోగ్య శాఖ...ఎట్టకేలకు ఆంక్షలను సడలించింది. డిసెంబర్ 4 నుంచి శుక్రవారం ప్రార్థనలను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే..ప్రార్థనలకు సంబంధించి కొన్ని షరతులను విధించింది. శుక్రవారం రోజున కేవలం పది నిమిషాలు మాత్రమే మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించింది. అది కూడా మసీదు సామర్ధ్యంలో 30 శాతం మందికే అనుమతినిచ్చారు. సెర్మన్ కు అరగంట ముందు తెరిచి..ప్రార్థన ముగిసిన అరగంట తర్వాత మసీదులను మూసివేయాలని సూచించింది. భక్తులెవరు వాష్రూమ్స్ లను వినియోగించకూడదని, వాష్రూమ్ లను క్లోజ్ చేయాలని తెలిపింది. ఇక తక్కిన రోజుల్లో ప్రార్థనకు పావుగంట ముందు మసీదుల తెరుచుకుంటాయి. ప్రార్థన ముగిసిన 10 నిమిషాల తర్వాత మూసివేయాల్సి ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో భక్తులు అందరూ తప్పనిసరిగా పేస్ మాస్క్ ధరించాలని, ఎవరికివారు సొంతంగా ప్రేయర్ మ్యాట్స్ తీసుకురావాలని సూచించింది. వయసు పైబడిన వారికి వైరస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది కనుక..వారు మసీదులకు వెళ్లకపోవటమే మంచిదని ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

--బాలాజీ(మాగల్ఫ్ ప్రతినిధి,యూఏఈ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com