పాక్‌లో కొత్త చట్టం!
- November 25, 2020
ఇస్లామబాద్: కొన్ని ఇస్లామిక్ దేశాల్లో చట్టాలు అత్యంత కఠినంగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. దొంగతనాలకు చేతులు నరికేయడం, అత్యాచారాలకు పాల్పడితే బహిరంగ శిరచ్ఛేదం, రాళ్లతో కొట్టిచంపడం వంటి శిక్షలుంటాయి. తాజాగా పాకిస్థాన్ లోనూ అలాంటి చట్టానికి రూపకల్పన జరుగుతోంది. ఇకపై అత్యాచారానికి పాల్పడిన వారిని రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేస్తారు. ఈ కఠిన చట్టానికి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఈ అత్యాచార నిరోధక ఆర్డినెన్స్ ముసాయిదాను దేశ న్యాయ మంత్రిత్వ శాఖ ఫెడరల్ కేబినెట్ ముందుకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నూతన చట్టం అంశాన్ని పాక్ లోని ఓ మీడియా సంస్థ వెల్లడించింది. దేశంలో అత్యాచారాల కట్టడికి ఈ కఠిన చట్టం దోహదపడుతుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ
- ఈ నెల 18న బిల్ గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ
- QFC వెబ్ సమ్మిట్..కంపెనీ ఉచితంగా నమోదు..!!
- దక్షిణ అల్ బతినా గవర్నరేట్‌లో కోటలు పునరుద్ధరణ..!!
- మర్డర్ చేసిన వ్యక్తులపై ప్రాసిక్యూషన్ విచారణ..!!
- సౌదీలో 328 మంది సెక్యూరిటీ ఆఫీసర్ల నియామకం..!!
- కువైట్ ఇ-వీసా సైబర్ ఫ్రాడ్ ను ఛేదించిన CBI..!!
- 20 మిలియన్ దిర్హమ్లు గెలిచిన భారత ప్రవాసుడు..!!
- క్రికెట్లో కొత్త రూల్స్, చౌక బ్యాట్లకు గ్రీన్ సిగ్నల్!
- ముంబై ఎయిర్‌పోర్టులో తప్పిన పెను ప్రమాదం







