కువైట్: ఇంట్లోనే మద్యం తయారీ...346 లిక్కర్ బాటిల్స్ సీజ్

- November 25, 2020 , by Maagulf
కువైట్: ఇంట్లోనే మద్యం తయారీ...346 లిక్కర్ బాటిల్స్ సీజ్

కువైట్: గల్ఫ్ కంట్రీస్ లో మద్యం అమ్మకాల విషయంలో రూల్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయన్న విషయం తెలిసిందే. అయినా..కొందరు తేలిగ్గా డబ్బు సంపాదించే అత్యాశతో జైలు పాలవుతున్నారు. అక్రమంగా లిక్కర్ బాటిల్స్ అమ్మితేనే కఠిన చర్యలు ఉంటాయి. అలాంటిది కువైట్ లోని అహ్మదీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఏకంగా అల్కాహాల్ ను సొంతంగా తయారు చేసి..అక్రమంగా అమ్ముతున్నారు. అయితే..పోలీసులు రోటీన్ గా గస్తీ డ్యూటీ చేస్తుండగా..మహ్ బౌలా ప్రాంతంలో ఓ బస్సు అనుమానస్పదంగా నిలిపి ఉంచినట్లు గమనించారు. బస్సు దగ్గరికి పోలీసులు వెళ్తుండగానే...మద్యం అమ్మకందారులు పోలీసులకు దొరక్కుండా పరిగెత్తి పారిపోయారు. దీంతో బస్సులో తనిఖీలు చేపట్టిన పోలీసులు...అమ్మకానికి సిద్ధంగా ఉంచిన 346 లిక్కర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. బస్సులో వారి వేలి ముద్రలను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com