ఏపీలో తగ్గిన కరోనా కేసులు, మరణాలు..
- November 25, 2020
ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 831 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,64,674కి చేరింది. ఇందులో 12,673 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,45,039 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 6 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,962కు చేరుకుంది. ఇక నిన్న 1,176 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. నేటితో రాష్ట్రవ్యాప్తంగా 97.88 సాంపిల్స్‌ను పరీక్షించారు….
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 34, చిత్తూరు 74, తూర్పుగోదావరి 126, గుంటూరు 90, కడప 37, కృష్ణా 145, కర్నూలు 28, నెల్లూరు 51, ప్రకాశం 12, శ్రీకాకుళం 23, విశాఖపట్నం 58, విజయనగరం 18, పశ్చిమ గోదావరి 135 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,21,970కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 824 మంది కరోనాతో మరణించారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్‌లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







