బహ్రెయిన్ ప్రధానితో భారత విదేశాంగ మంత్రి భేటీ..
- November 26, 2020
మనామా:రెండు రోజుల బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధాని సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫాతో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్ దివంగత ప్రధాని ఖలీఫా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా మృతికి భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తరపున ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అనంతరం..ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపై చర్చించారు. కోవిడ్ నేపథ్యంలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పరస్పరం సహకరించుకుంటున్న ఇరు దేశాలు భవిష్యత్తులోనూ అదే పంథాను కొనసాగించాలని బహ్రెయిన్ రాజు ఆకాంక్షించారు. అలాగే పలు రంగాల్లో పురోభివృద్ధి సాధించే దిశగా అవసరమైన సాయం ఇచ్చిపుచ్చుకోవాలన్నారు. అవకాశం ఉన్న రంగాల్లో అవసరమైన మేర పెట్టుబడులను విస్తరించుకోవాలని అభిలాషించారు. మరోవైపు బహ్రెయిన్ అభివృద్ధిలో ఆర్ధిక ఎదుగుదలలో ప్రవాస భారతీయుల కృషిని, భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. ఇదిలాఉంటే..బహ్రెయిన్ ప్రధాని, భారత విదేశాంగ శాఖ మంత్రి మధ్య ఇరు దేశాలపై ప్రభావం చూపే పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
తాజా వార్తలు
- నిబంధనలు ఉల్లంఘించిన డ్రైవర్లకు 10,000 Dh వరకు జరిమానా, 12 బ్లాక్ పాయింట్లు
- ఒకే వేదిక పై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి..
- ఇన్ఫోసిస్ కొత్త ప్రోత్సాహకాలు
- తెరుచుకున్న శబరిమల ఆలయం..
- ఫిబ్రవరి నెల దర్శన కోటా విడుదల వివరాలు
- చంద్రయాన్-4కు సిద్ధమైన ఇస్రో కీలక అప్డేట్..
- సహెల్ యాప్లో కొత్త సేవ ప్రారంభం
- మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
- IPL 2026: ఫ్రాంచైజీల రిటెన్షన్ లిస్ట్ ఇదే
- 'దమ్ముంటే పట్టుకోండి' అన్నాడు..చాలా సింపుల్ గా పట్టుకున్నారు: CV ఆనంద్







