అర్నాబ్ గోస్వామి బెయిల్ పొడిగింపు..
- November 27, 2020
న్యూఢిల్లీ: అర్నాబ్ గోస్వామి బెయిల్ ను సుప్రీంకోర్టు పొడిగించింది. గోస్వామి తాత్కాలిక బెయిల్ ను మరో నాలుగు వారాలు పొడిగిస్తున్నట్టు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం తెలిపింది. ఆర్కిటెక్ట్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారనే ఆరోపణలతో నమోదైన కేసులో గోస్వామి అరెస్ట్ అయి, బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ, ఆత్మహత్య చేసుకునే విధంగా గోస్వామి ప్రేరేపించినట్టు చెప్పలేమని అన్నారు. గోస్వామిపై ఉన్న ఆరోపణలను మహారాష్ట్ర పోలీసులు నిరూపించలేకపోయారని చెప్పారు. తన అధికారాన్ని ఉపయోగించడంలో బాంబే హైకోర్టు విఫలమైందని అన్నారు. ఏ వ్యక్తికైనా సరే ఒక్కరోజు వ్యక్తిగత స్వేచ్ఛను పోగొట్టడం కూడా తీవ్రమైన విషయమేనని చెప్పారు. క్రిమినల్ చట్టాలు ప్రజలను వేధించే సాధనంగా మారకూడదని అన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!