యుఏఈ జైళ్ళకే ఇండియన్ ప్రిజనర్స్ మొగ్గు
- February 18, 2016
యుఏఈ జైళ్ళలో ఉండేందుకే ఇండియన్ ప్రిజనర్స్ మొగ్గు చూపుతున్నట్లు యుఏఈలోని ఇండియా రాయబారి టి.పి. సీతారామ్ చెప్పారు. ఇది అంగీకరించవలసిన వాస్తవని ఆయన అన్నారు. 1200 మందిలో కేవలం 10 శాతం మంది మాత్రమే యూఏఈ నుంచి ఇండియా జైళ్ళకు వెళ్ళేందుకు అప్లికేషన్లు పెట్టుకున్నట్లు చెప్పారాయన. ఐదుగురి పేర్లను యూఏఈ అథారిటీస్ నుంచి అందుకున్నామనీ, తరలింపు ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందనీ, అయితే అది ఎప్పుడన్నది ఖచ్చితంగా చెప్పలేమని ఆయన అన్నారు. ట్రాన్స్‌ఫర్‌ని కోరుకుంటున్న ఖైదీలు, యూఏఈలో మినిమమ్ ఆరు నెలలు జైలు శిక్ష అనుభవించి ఉండాలి. అలాగే వారిపై ఎలాంటి అదనపు కేసులూ ఉండకూడదు. ఇరు దేశాల మధ్య ఒప్పందం మేరకు ఎక్కడికి తరలించాల్సి వస్తుందో ఆ దేశం ఖైదీల ప్రయాణ ఖర్చుల్ని భరించాలి. అయితే యూఏఈ జైళ్ళలోనే ఉండేందుకు ఖైదీలు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణం ఇండియాతో పోల్చితే యూఏఈ జైళ్ళలో సౌకర్యాలు బాగుండడమేనట.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







