ఆర్బిట్ లోకి యూఏఈ ఫాల్కన్ ఐ..

- December 02, 2020 , by Maagulf
ఆర్బిట్ లోకి యూఏఈ ఫాల్కన్ ఐ..

యూఏఈ:49వ జాతీయ దినోత్సవ వేళ ప్రజలకు మరో కానుక ఇచ్చింది యూఏఈ. హై రెజల్యూషన్ శాటిలైట్ ఫాల్కన్ ఐని విజయవంతంగా ఆర్బిట్ లోకి ప్రవేశ పెట్టింది. సౌత్ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా స్పేస్ సెంటర్ వేదికగా ఈ ఉదయం 5 గంటల 33 నిమిషాలకు రోదసిలోకి దూసుకెళ్లిన సొయుజ్ ఎస్టీ-ఏ రాకెట్ ఫాల్కన్ ఐ శాటిలైట్ ను అంతరిక్షంలో తీసుకెళ్లింది. 58వ నిమిషంలో రాకెట్ నుంచి వేరుపడిన శాటిలైట్.. ఆ తర్వాతి దశలను విజయవంతంగా దాటుకుంటూ నిర్ణీత కక్ష్యాలోకి చేరుకుంది. హై రిజల్యూషన్ ఇమేజర్ శాటిలైట్ ప్రయోగాల్లో యూఏఈకి ఇది నాలుగవది. కాగా మొత్తంగా 12వ రాకెట్ ప్రయోగం. ఫాల్కన్ ఐ..అంటే డేగకన్ను అని అర్ధం. అంటే..అత్యాధునిక శక్తివంతమైన లెన్స్ లు కలిగిన ఈ ఫాల్కన్ ఐ శాటిలైట్..మ్యాపింగ్, పట్టణ ప్రణాళికతో పాటు వ్యవసాయ రంగానికి దోహదం చేయనుంది. అలాగే..ప్రకృతి విపత్తులపై కూడా ఫాల్కన్ ఐ సమాచారం అందించనుంది. యూఏఈ సరిహద్దులు, సముద్ర తీరంపై కూడా ఫాల్కన్ ఐ కన్నేసి ఉంచుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com