శుక్రవారం ప్రార్థనల కోసం నేటి నుంచి తెరచుకోనున్న 766 మసీదులు

- December 03, 2020 , by Maagulf
శుక్రవారం ప్రార్థనల కోసం నేటి నుంచి తెరచుకోనున్న 766 మసీదులు

దుబాయ్‌: ఈ శుక్రవారం.. అంటే డిసెంబర్‌ 4 నుంచి 760కి పైగా మసీదులు దుబాయ్‌లో శుక్రవారం ప్రార్థనల కోసం తెరచుకోనున్నాయి. శుక్రవారం ప్రార్థనలపై ఆంక్షలు నేటితో ముగియనున్నాయి. నేషనల్‌ ఎమర్జన్సీ క్రైసిస్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఈ మేరకు ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కాగా, మసీదులలోకి ప్రవేశాన్ని రెగ్యులేట్‌ చేస్తున్నట్లు డిపార్ట్‌మెంట్‌ పేర్కొంది. మసీదులోని ఆయా ప్రాంతాలు నిండితే, బయటనే వర్షిపర్స్‌కి అకామడేట్‌ చేస్తారు. సామర్థ్యంలో 30 శాతం మందికి మాత్రమే అవకాశం కల్పించనున్నారు. బయటి కోర్టుయార్డుల్లో ప్రార్థనలకు అనుమతిస్తారు. వాటిని లౌడ్‌ స్పీకర్ల ద్వారా అందరికీ విన్పించేలా చేస్తారు. 10 నిమిషాలకు మించి శుక్రవారం సెర్మాన్‌ వుండకూడదు. ప్రార్థనలకు హాజరయ్యేవారంతా మాస్కులు ధరించాలి. ప్రేయర్‌ రగ్‌ని కూడా తమ వెంట తెచ్చుకోవాలి. ఇతరులతో వాటిని పంచుకోకూడదు. ఫుడ్‌ అలాగే వాటర్‌ డిస్ట్రిబ్యూషన్‌ని కూడా అనుమతించరు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com