మలేషియా లో కరీంనగర్ జిల్లా వాసి మృతి
- December 03, 2020
కౌలా లంపూర్ :కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నేదునూరి గ్రామానికి చెందిన కోరేపు ఎల్లయ్య ఇటీవల మలేషియా జోహార్బారు లోని షాఆలం హాస్పిటల్లో న్యూమోనియా తో 14th నవంబర్ న మృతిచెందాడు. ఈ విషయం మృతిని బంధువులు మరియు భార్య కోరేపు జ్యోతి మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైట) కి తెలియజేసారు.
ఈ విషయం తెలిసిన వెంటనే మైట ప్రెసిడెంట్ సైదం తిరుపతి, డిప్యూటీ ప్రెసిడెంట్ సత్య మైగ్రేట్ వింగ్ హెడ్ ప్రతీక్ యూత్ ప్రెసిడెంట్ కిరణ్ గౌడ్ మలేషియా లోని ఇండియన్ ఎంబసీ తో ఆసుపత్రి తో మరియు వారి బంధువులతో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని రేపు 04/12/2020 రోజున వందే భరత్ మిషన్ లో భాగమైన ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ IX 1921 ప్రత్యేక విమానం లో హైదరాబాద్ శంషాబాద్ ఏర్పోర్ట్ కు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేసారు అలాగే తెలంగాణ ప్రభుత్వం విమానాశ్రయం నుండి వారి గ్రామానికి అంబులెన్సు సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నది. దీనికి సహకరించిన NRI సెల్ చిట్టి బాబు కి మైట తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు
హాస్పిటల్ లో కోరేపు ఎల్లయ్య ట్రీట్మెంట్ కి సంబంధించిన ఖర్చు మొత్తాన్ని దాదాపు 50 వేయిల రూపాయలు మలేషియా తెలంగాణ అసోసియేషన్ భరించింది అలాగే మైట విన్నపం మేరకు ఈ మృత దేహాన్ని హైదరాబాద్ పంపడానికి ఆయన మొత్తం ఖర్చు దాదాపు 1.5లక్షలా రూపాయలను మలేషియా లోని ఇండియన్ ఎంబసీ పూర్తిగా భరించిందని మైట వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి తెలియజేసారు.
అలాగే దీనికి సహకరించిన కోర్ కమిటీ సబ్యులకు మరియు మైట సబ్యులకు ప్రెసిడెంట్ సైదం తిరుపతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!