గూగుల్ మాప్స్‌లో సరికొత్త ఫీచర్
- December 04, 2020
గూగుల్ మ్యాప్స్ సరికొత్త అప్‌డేట్‌ను తీసుకొస్తోంది. తాజా బీటా నివేదిక ప్రకారం, గూగుల్ మ్యాప్స్ లో 'రైడ్ సర్వీసెస్' అనే కొత్త సర్వీస్ ని తీసుకోరాబోతుంది. మ్యాప్స్ నుండి రైడ్-షేరింగ్ కంపెనీకి రూట్ సమాచారాన్ని పంపడం ద్వారా మరింత ఖచ్చితమైన ఛార్జీలను తెలుసుకోవడానికి సహాయపడుతుంది. ప్రస్తుతం ఈ 'రైడ్ సర్వీసెస్' సెట్టింగ్ అనేది ఉబెర్ కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ సర్వీసులు అనేవి వేర్వేరు ప్రాంతాలలో విభిన్నంగా ఉండవచ్చు. ప్రస్తుతం ఇది ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. త్వరలో ఈ సేవలు మరింత మందికి అందుబాటులోకి రానున్నాయి. గూగుల్ మ్యాప్స్ యొక్క తాజా బీటా వెర్షన్ లో బిల్డింగ్ నంబర్లు మరియు క్రాస్‌వాక్ గుర్తులను జోడించినట్లు నివేదిక పేర్కొంది. పరిమిత నగరాల కోసం అందుబాటులో ఉన్న ఈ సేవలు త్వరలో మరిన్నీ నగరాలకు విస్తరించనున్నట్లు సమాచారం. న్యూయార్క్ వంటి నగరాల్లోని వీధుల్లో మ్యాప్ లను జూమ్ చేయడం ద్వారా మీరు భవనాల సంఖ్యలను మరియు క్రాస్‌వాక్ గుర్తులను గుర్తించవచ్చని నివేదికలోని స్క్రీన్‌షాట్‌లలో తెలుస్తుంది.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







