చట్టపరమైన హక్కులపై వలసదారుల్లో అవగాహన
- February 19, 2016
మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మరియు ఎమిరిటైజేషన్ సక్ర్ ఘోబాష్ 'నో యువర్ రైట్స్' (మీ హక్కులు తెలుసుకోండి) పేరుతో ఓ అవగాహనా క్యాంపెయిన్‌ని ప్రారంభించారు. కార్మికులు తమ హక్కులను తెలుసుకునేలా వారిలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ఉద్దేశ్యం. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లోనే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఘోబాష్ చెప్పారు. వర్క్ పర్మిట్లను పొందడం, అలాగే కాంట్రాక్టుల్ని రద్దు చేసుకోవడం, కొత్త కాంట్రాక్టుల్ని కుదుర్చుకోవడం వంటివాటికి సంబంధించి కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన డిక్రీల గురించి కార్మికుల్లో అవగాహన పెంచనున్నారు. కార్మికుల రక్షణ కోసం యూఏఈ కట్టుబడి ఉందని గోభాష్ చెప్పారు. అరబిక్, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ మరియు మలయాళ భాషల్లో రూపొందించిన బుక్‌లెట్స్‌ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో మినిస్ట్రీ ప్లాట్‌ఫామ్ ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ బుక్‌లెట్స్‌లో లీగల్ గైడ్‌లైన్స్, కార్మికుల్లో అవగాహన పెంచేలా పొందుపర్చబడ్డాయి. హక్కులు, ఆబ్లిగేషన్స్, అలాగే ల్యాబర్ డిస్ప్యూట్స్ వంటి గురించి వివరంగా పేర్కొన్నారు. అబుదాబీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా ఇలాంటి కార్యక్రమం చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!







