నేపాల్, భారత్ మధ్య 400 కేవీ విద్యుత్తు లైన్..
- February 20, 2016
నేపాల్ మధ్య 400 కేవీ ట్రాన్స్మిషన్ లైన్‌ను ప్రధానులు నరేంద్ర మోదీ, ఖడ్గ ప్రసాద్ శర్మ సంయుక్తంగా ప్రారంభించారు. భారత్‌లోని ముజఫర్‌పూర్, నేపాల్‌లోని ధల్కీబార్ ప్రాంతాల మధ్య ఈ కొత్త విద్యుత్తు సరఫరా లైనును నిర్మించారు. ఇవాళ ఇరు దేశాల మధ్య తొమ్మిది కీలకంశాలపై ఒప్పందాలు కుదిరాయి. ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో ఇరు దేశాల ప్రధానుల ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు సంయుక్త ప్రకటన చేశారు. అభివృద్ధి దిశగా ఇరు దేశాల సంబంధాలు బలపడాలని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో భద్రత ఎంత పటిష్టంగా ఉంటే, నేపాల్‌లో అంత స్థిరత్వం ఉంటుందని, ఇరు దేశాలు ఉగ్రవాద చర్యల పట్ల కలిసి పోరాడుతాయని మోదీ తెలిపారు.నేపాల్‌లోని తేరాయి ప్రాంతంలో రోడ్డు నిర్మాణం వల్ల ఇరు దేశాల మధ్య వాణిజ్య బంధం మరింత బలపడుతుందని మోదీ అన్నారు. నేపాల్‌తో భారత్ సంబంధాలను మోదీ మరింత ఎత్తుకు తీసుకెళ్లారని ప్రధాని శర్మ ఓలీ అన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







