అద్భుతమైన ఔషధగుణాలున్న ఏలకులు..

అద్భుతమైన ఔషధగుణాలున్న ఏలకులు..

పాయసం చేసినా, పరమాన్నం చేసినా ఏలకులు వేస్తే కమ్మని వాసన, రుచి. మాంసాహార వంటకాల్లో సైతం ఏలకుల పాత్ర ప్రముఖమైంది. నోరు దుర్వాసన రాకుండా ఉంటుంది ఏలకులు నోట్లో వేసుకుంటే. ఔషధగుణాలు మెండుగా ఉన్న ఈ ఏలకుల గురించి తెలుసుకుందాము. ఉత్తమమైన, ఆరోగ్యకరమైన మసాల దినుసు ఇది. టీ, స్వీట్లు, ఇతర వంటకాల్లో వీటిని విరివిగా వాడుతుంటారు. బరువు తగ్గడానికి, శరీరంలోని విషపదార్ధాలను తొలగించడానికి, జీర్ణక్రియతో పోరాడడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తపోటును తగ్గించడానికి ఏలకులు బాగా పని చేస్తాయి.

శ్వాస కోశ వ్యాధులను పరిష్కరించడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఏలకులు సహాయపడతాయి. వీటిల్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు జలుబు, దగ్గు, శ్వాసకోశ సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి. ఏలకులను పొడి చేసుకుని తేనెతో పాటు తీసుకుంటే చాలా రోగాలకు ప్రభావవంతమైన సహజ నివారణిగా పనిచేస్తుంది. భోజనం చేసిన తరువాత రెండు మూడు ఏలకులు నమిలితే జీర్ణక్రియకు ఉపయోగపడే ఎంజైములు విడుదల అవుతాయి. అజీర్ణం, గ్యాస్ ఇబ్బంది, మలబద్దకం వంటి కడుపులోని సమస్యలకు ఏలకులు చక్కని పరిష్కారం. చైనీయుల సంప్రదాయం ఏలకుల టీ తాగడం. దీని వలన దీర్ఘాయువు లభిస్తుందని విశ్వసిస్తారు. ఈ టీ శరీరంలో అతంర్గత వ్యవస్తలను శుభ్రపరుస్తుంది. రక్తప్రసరణను పెంచి శ్వాసకోశ వ్యాధులు దరి చేరకుండా చూస్తుంది. వీటిలో ఉన్న మాంగనీసు రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఏలకుల నూనె వాసన పీలిస్తే నిద్రలేమి సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

Back to Top