ఖతార్‌ ఎయిర్‌ పోర్ట్‌ మూసివేత.. అన్నీ పుకార్లే

- December 28, 2020 , by Maagulf
ఖతార్‌ ఎయిర్‌ పోర్ట్‌ మూసివేత.. అన్నీ పుకార్లే

ఖతార్: హమాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌, మూసివేత పుకార్లను తీవ్రంగా ఖండించింది. సోషల్‌ మీడియా వేదికగా ఎయిర్‌ పోర్ట్‌ మూసివేతపై పుకార్లు హల్‌చల్‌ చేస్తున్న దరిమిలా, ఎయిర్‌పోర్ట్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. హమాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో యధాతథంగా కార్యకలాపాలు నడుస్తున్నాయనీ, ప్రయాణీకులకు అన్ని సౌకర్యాలూ అందిస్తున్నామని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. ఖతార్‌లోకి ప్రయాణీకులు వచ్చేందుకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సూచించిన అన్ని ప్రికాషన్స్‌ తీసుకుంటున్నామనీ, హమాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ పేర్కొంది. ఎయిర్‌ పోర్ట్‌కి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అధికారిక ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా తెలుసుకోవచ్చని వివరించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com