పట్టాలెక్కిన తొలి డ్రైవర్ రహిత రైలు
- December 28, 2020
న్యూఢిల్లీ: దేశంలో తొలి డ్రైవర్ రహిత మెట్రో రైలు నేడు పట్టాలెక్కింది. ఈ రైల్వే సర్వీసును సోమవారం ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ ప్రారంభించారు. దీంతో ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఈ ఘనత దక్కింది. ఢిల్లీ మెట్రో కారిడార్‌లోని మెజెంటా లైన్‌లో జనక్‌పురి వెస్ట్-బొటానికల్ గార్డెన్‌లో మొత్తం 37 కిలోమీటర్ల మేర ఈ రైలు నడువనుంది. 2021 మధ్యనాటికి ఢిల్లీ మెట్రోలోని 57 కిలోమీటర్ల పింక్ లైన్‌లో కూడా ఈ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. డ్రైవర్ లేకుండా నడిచే రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 7 శాతం మాత్రమే ఉన్నాయి. దేశంలో ఇదే మొదటి రైలు కావడం విశేషం.
అదేవిధంగా నేషనల్ మొబిలిటీ కార్డును (ఎన్‌సీఎంసీ) కూడా ప్రధాని ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోలోని పది కారిడార్లలో మొదటిసారిగా ఎన్‌సీఎంసీ సేవలు వినియోగంలోకి రానున్నాయి. వన్ నేషన్ వన్ కార్డు నినాదంలో భాగంగా ఎన్‌సీఎంసీ సేవలను మోదీ ప్రారంభిస్తున్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!