'సోగ్గాడే చిన్నినాయనా' విడుదల తేదీకి 'బంగార్రాజు' ముహూర్తం!
- December 28, 2020కింగ్ నాగార్జున కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన చిత్రం 'సోగ్గాడే చిన్నినాయనా (2016). నాగ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాతో కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయమయ్యారు. కాగా, 'బంగార్రాజు' పేరుతో త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్ రాబోతోంది. 'సోగ్గాడే..'లో బంగార్రాజు పాత్రకి జోడీగా నటించిన రమ్యకృష్ణ ఇందులోనూ నటిస్తారని టాక్.
ఇదిలా ఉంటే.. ఈ పాటికే మొదలు కావాల్సిన 'బంగార్రాజు' కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. 'సోగ్గాడే చిన్నినాయనా' విడుదల తేది అయిన జనవరి 15నే 'బంగార్రాజు'కి సంబంధించిన ముహూర్తంని ఫిక్స్ చేశారట. అలాగే జనవరి నుంచే రెగ్యులర్ షూటింగ్ ని కూడా ప్లాన్ చేస్తున్నారని వినికిడి. మరి.. 'బంగార్రాజు'తో నాగ్, కళ్యాణ్ కృష్ణ మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి.
'సోగ్గాడే చిన్ని నాయనా'కి సంగీతమందించిన అనూప్ రూబెన్స్.. 'బంగార్రాజు'కి కూడా బాణీలు అందిస్తున్నారని సమాచారం.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..