దుబాయ్ న్యూ ఇయర్ సెల్రబేషన్స్: ఉచిత బస్ సర్వీస్ ప్రకటన
- December 29, 2020
దుబాయ్: కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా దుబాయ్ రోడ్లు మరియు రవాణా అథారిటీ, బుర్జ్ ఖలీఫా చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఉచిత బస్ సర్వీసులను కూడా అందుబాటులోకి తెస్తోంది. మొత్తం 200 బస్సులను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నట్లు అథారిటీ ప్రకటించింది. ఈవెంట్ వెన్యూ నుంచి మెట్రో స్టేషన్ల వరకు అలాగే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్, ముసల్లాహ్ అల్ ీద్ హాల్ (మన్ ఖూల్) అలాగే అల్ వసల్ క్లబ్ తదితర పార్కింగ్ లాట్స్ వరకు ఈ బస్సులు అందుబాటులో వుంటాయి. రోడ్ల మూసివేతకు సంబంధించి స్మార్ట్ స్ర్కీన్లను కూడా ఏర్పాటు చేసి, వాహనదారులకు అవగాహన కల్పిస్తారు. ఫైనాన్షియల్ సెంటర్ రోడ్, షేక్ మొహమ్మద్ రషీద్ బిఎల్వీడీ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ లైట్లను మానిటర్ చేస్తారు. పబ్లిక్ సేప్టీని పరిగణనలోకి తీసుకుని, వాటర్ కెనాల్ పైన పాదచారుల వంతెనలు, వాటర్ కెనాల్ ఎలివేటర్లు, షేక్ జాయెద్ బ్రిడ్జిపై పాదచారుల పియర్ వంటివాటిని మూసివేస్తున్నారు.
తాజా వార్తలు
- కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా!!
- కువైట్ లో భద్రతకు చెక్ పాయింట్లు కీలకం..!!
- ఇబ్రిలో అగ్నిప్రమాదం..తప్పిన పెను ప్రమాదం..!!
- బహ్రెయిన్ లో యూఏఈ సైనికుడు మృతి..!!
- ఒమన్ సుల్తాన్‌కు సంతాపం తెలిపిన కింగ్ సల్మాన్, క్రౌన్ ప్రిన్స్..!!
- షకీరా దోహా కాన్సర్ట్ వాయిదా..!!
- యూఏఈ ఆధ్వర్యంలో ఆఫ్గాన్ చెరనుంచి అమెరికన్ విడుదల..!!
- భారత్ లోనే తొలి కారుణ్య మరణం కేసు..
- హైదరాబాద్‌కు 915 ఎలక్ట్రిక్ బస్సులు
- కువైట్ ఎయిర్వేస్ ప్రయాణికులకు శుభవార్త









