న్యూ ఇయర్: రస్ అల్ ఖైమాలో రోడ్లు మూసివేత
- December 30, 2020
రస్ అల్ ఖైమా పోలీసులు న్యూ ఇయర్ ఈవెంట్స్ నేపథ్యంలో పలు కీలక సూచనలు చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కొన్ని రోడ్లపై వాహనాలను అనుమతించరు. షేక్ మొహమ్మద్ బిన్ సలెమ్ అల్ కాసిమి రోడ్డు నుంచి అల్ హమ్రా రౌండెబౌట్ మీదుగా అల్ మ్రజాన్ వైపుకు, ఉమ్ అల్ కువైన్ నుంచి అల్ మ్రజాన్ ఐలాండ్కి వెళ్ళే అల్ ఎతిహాద్ రోడ్డు, షేక్ మొహమ్మద్ బిన్ సలెమ్ అల్ కాసిమి రోడ్ నుంచి ఉమ్ అల్ కువైన్ వైపు వెళ్ళే రోడ్డు మూసివేస్తారు. ఇతర ఎమిరేట్లకు వెళ్ళే వాహనాల్ని షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డు (ఇ311) మరియు ఎమిరేట్స్ రోడ్ (ఇ611) వైపు మళ్ళిస్తారు. అనధికారికంగా ఆయా రోడ్లపై ప్రవేశించేవారికి 3,000 ఎఇడి నుంచి 50,000 ఎఇడి వరకు జరీమానా విదిస్తారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!