కరోనా వ్యాక్సిన్ పేరిట మోసం... తస్మాత్ జాగ్రత్త !!

- December 30, 2020 , by Maagulf
కరోనా వ్యాక్సిన్ పేరిట మోసం... తస్మాత్ జాగ్రత్త !!

హైదరాబాద్:కరోనా కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త తరహా నేరాలు చేస్తున్నారు. కరోనా పట్ల ప్రజల భయాన్ని ఆసరాగా చేసుకొని కరోనా కు వ్యాక్సిన్ రాబోతుందని ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఆధార్ కార్డు, బ్యాంక్, మొబైల్ నంబర్ కు వచ్చే ఓటీపీ వివరాలను పంపించమని ప్రజలను బకరాలు చేస్తూనే ఉన్నారు. వారు అడిగిన వివరాలను పంపించగానే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. 

 - కరోనా వ్యాక్సిన్ కోసమని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే మోసమని గ్రహించాలి. 
- అనుమానం ఉంటే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444 నంబర్ లేదా సైబరాబాద్ సైబర్ క్రైమ్ నంబర్ కంప్లైంట్స్ సెల్ 9490617310 నంబర్ లో సంప్రదించాలన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com