ఆరోగ్య ప్రమాణాలు పాటించని రెస్టారెంట్ సీజ్
- December 31, 2020
అబుధాబి: ఆహార భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వినియోగదారుల ఆరోగ్యానికి హని కలిగిస్తున్నారనే ఆరోపణలతో ఓ రెస్టారెంట్ ను వ్యవసాయ, అహార భద్రత అధికారులు సీజ్ చేశారు. ముసఫ్ఫా ప్రాంతంలోని స్పెషల్ డిన్నర్ రెస్టారెంట్ కొన్నాళ్లుగా అహార భద్రత ప్రమాణాలను పాటించటం లేదనే ఆరోపణలు ఉన్నాయి. వ్యవసాయ, అహార భద్రత అధికారులు పలు మార్లు తనిఖీలు నిర్వహించి ఇప్పటికే మూడు సార్లు హెచ్చరికలు కూడా జారీ చేశారు. వంట గది మొత్తం అపరిశుభ్రంగా ఉందని, వంట విషయంలోనూ నాణ్యత లేదని ఆరోపించింది. హెచ్చరికలు చేస్తున్నప్పటికీ రెస్టారెంట్ నిర్వాహకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో రెస్టారెంట్ ను సీజ్ చేసినట్లు అధికారులు వివరించారు. వినియోగదారుల ఆరోగ్య భద్రత తమకు ముఖ్యమని, రెస్టారెంట్ నిర్వాహకులు తమ తప్పులను దిద్దుకున్న తర్వాతే మళ్లీ ప్రారంభించేందుకు అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. ప్రమాణాలు పాటించకుండా నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడినట్లు ప్రజలు గుర్తిస్తే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 800555కి ఫోన్ చేసి తమకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!