జగిత్యాలలో గల్ఫ్ కార్మికుల ధర్నా,రాస్తా రోకో...

- January 03, 2021 , by Maagulf
జగిత్యాలలో గల్ఫ్ కార్మికుల ధర్నా,రాస్తా రోకో...

గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్, మరికొందరిని  అదుపులోకి తీసుకున్న జగిత్యాల పోలీసులు

రాష్ట్రం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి

కేంద్రం వేతన తగ్గింపు సర్కులర్లను వాపస్ తీసుకోవాలి

తెలంగాణ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీచేసిన సర్కులర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాల కొత్త బస్ స్టాండ్ చౌరస్తా లో గల్ఫ్ కార్మికులు నిరసన ప్రదర్శన, రాస్తా రోకో నిర్వహించారు. 

రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలి చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సహాయం చేయాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు.

జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎస్. నరేష్ రెడ్డి, ఎద్దండి భూమయ్య, సూదవేని గంగాధర్, మల్యాల శేఖర్ గౌడ్, అమరగోని తిరుపతి, దుర్గ ప్రసాద్, అలీం, పరమేష్ రావు, బద్దం వినయ్, కల్లెడ వినయ్, తీపిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com