భారత్ తయారు చేసిన 'కొవాగ్జిన్' కు భారీ డిమాండ్
- January 04, 2021
యావత్ ప్రపంచం ఎదురుచూస్తోన్న కరోనా వ్యాక్సిన్ ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద దాదాపు 30దేశాల్లో పలు కంపెనీలకు చెందిన టీకాలు అనుమతులు పొందాయి. ఇక భారత్‌లోనూ అత్యవసర వినియోగం కింద రెండు వ్యాక్సిన్లు అనుమతి పొందాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ల తయారీ, అభివృద్ధి కేంద్రంగా ఉన్న భారత్‌వైపు ప్రపంచదేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. దీనిలో భాగంగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’ డోసుల కోసం బ్రెజిల్ సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రకటించింది. ప్రయోగదశలో ఉన్న ఈ టీకా వివరాలను తెలుసుకునేందుకు వివిధ దేశాల దౌత్యవేత్తలు హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీని ఇటీవలే సందర్శించిన విషయం తెలిసిందే.
భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలోనే అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) అనుమతి లభించింది. దీంతో బ్రెజిల్‌కు చెందిన ప్రైవేటు సంస్థ బ్రెజిలియన్ అసోసియేషన్ ఆఫ్ వ్యాక్సిన్ క్లినిక్స్(ఏబీసీవీఏసీ) కొవాగ్జిన్ డోసుల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం భారత కంపెనీతో ఇప్పటికే ఎంవోయూ కుదుర్చుకున్నట్లు ధ్రువీకరించింది. ‘ప్రైవేటు మార్కెట్లో వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇందులో భాగంగా భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ ఆశాజనకంగా కనిపిస్తోంది’ అని ఏబీసీవీఏసీ అధ్యక్షుడు గెరాల్డో బార్బోసా అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఆర్డర్ చేసుకునే వ్యాక్సిన్లకు అదనంగా వీటిని కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. అయితే, దీనికి బ్రెజిల్ ఆరోగ్య నియంత్రణ సంస్థ అన్విసా తుది అనుమతి ఇవ్వాల్సి ఉంది.
తాజా వార్తలు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు