ట్రావెల్ బ్యాన్ ఎత్తివేత: పోటెత్తిన ప్రయాణీకులు
- January 04, 2021
రియాద్:విదేశాల్లో నిలిచిపోయిన వేలాది మంది సౌదీలు, వలసదారులు, కింగ్డమ్కి తిరిగి వెళ్ళేందుకు పోటీ పడుతున్నారు. విమానాలపై నిషేధాన్ని సౌదీ అరేబియా ఎత్తివేయడంతో పెద్దయెత్తున ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకుంటున్నారు. విమానం ద్వారా, సముద్ర మార్గంలో, రోడ్డు మార్గాన వచ్చేందుకు ప్రయాణీకులు పెద్ద సంఖ్యలో ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యూకేలో కరోనా కొత్త స్ట్రెయిన్ వెలుగు చూసిన దరిమిలా, రెండు వారాలుగా సౌదీ అరేబియా, ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెల్సిందే. ఆదివారం ఉదయం 11 గంటలకు ట్రావెల్ బ్యాన్ ఎత్తివేశారు. కరోనా నిబంధనల కారణంగా, చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని ప్రయాణీకులు చెబుతున్నారు. సౌదీ నుంచి వేరే పనుల నిమిత్తం విదేశాలకు వచ్చి ఇరుక్కుపోయామనీ, ఆయా దేశాల నిబంధనలతో తీవ్ర సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు ప్రయాణీకులు వాపోయారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!