60,000 దిర్హామ్‌లు తీసుకెళ్తే నేరమే

- February 22, 2016 , by Maagulf
60,000 దిర్హామ్‌లు తీసుకెళ్తే నేరమే

60,000 దిర్హామ్‌లు అంతకన్నా ఎక్కువ నగదుగానీ, అంత కన్నా విలువైన వస్తువుల్నిగానీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో తరలించడం నేరమని దుబాయ్‌ పోలీసులు వెల్లడించారు. అబుదాబీ పోలీస్‌, ట్రాన్స్‌పోర్ట్‌ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ లెఫ్టినెంట్‌ కల్నల్‌ అల్‌ బస్తకి మాట్లాడుతూ, అంత మొత్తంలో నగదు లేదా అంత విలువైన వస్తువుల్ని తరలించడం ప్రమాదకరమనీ, తమ జీవితాన్ని ఎవరూ రిస్క్‌లో పడేసుకోకుండా ఉండటమే మేలని ఆయన అన్నారు. దుబాయ్‌కి చెందిన జ్యుయెలరీ షాప్‌ సేల్స్‌మెన్‌, బ్యాగులో గోల్డ్‌ మరియు డైమండ్స్‌ని తరలించేందుకు, దుబాయ్‌ మెట్రోను ఆశ్రయించాడనీ, అతనికి చట్టం ఉల్లంఘించినందుకుగాను ఫైన్‌ విధించడం జరిగిందని చెప్పారు. ఖరీదైన వస్తువులు లేదా నగదును తరలించడానికి ప్రత్యేకంగా ఏర్పాటైన మనీ ట్రాన్స్‌ఫర్‌ కంపెనీలను వినియోగించాలని కోరారు. మరో ఘటనలో ఓ వ్యక్తి 165,000 దిర్హామ్‌లు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారనీ, దానికి ఆయన సరైన సమాధానం ఇవ్వలేదని చెప్పాడు. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు. ఇలాంటి వ్యక్తుల్ని దొంగలు, క్రిమినల్స్‌ అనుసరిస్తుంటారు గనుక, వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని అల్‌ బస్తకి చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com