కాలానుగుణంగా వృత్తి నైపుణ్యం పెంచుకుంటాం-ఏపీ డీజీపి గౌతమ్ సవాంగ్
- January 06, 2021_1609875173.jpg)
తిరుపతి: మారుతున్న కాలానికి అనుగుణంగా పోలీసు శాఖలో వృత్తిపరమైన నైపుణ్యం పెంచుకుంటామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ) గౌతమ్ సవాంగ్ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న ఏపీ పోలీస్ డ్యూటీ మీట్ తొలిరోజు ప్రారంభ కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ తొలి డ్యూటీ మీట్ పోలీస్ శాఖ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోతుందని, 15 ఏళ్ల తర్వాత తిరుపతిలో రెండవ సారి నిర్వహించుకుంటున్నామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆరేళ్లుగా డ్యూటీ మీట్ నిర్వహించలేదన్నారు. ఇకపై ఏటా నిర్వహించుకుంటామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన కలెక్టర్లు, ఎస్పీల తొలి సమావేశంలో పీపుల్స్ ఫ్రెండ్లీగా వ్యవహరించాలంటూ చిరునవ్వుతో చెప్పారని డీజీపీ గుర్తు చేసుకున్నారు. దేశంలోని అనేక రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్నందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు గర్వంగా ఉందన్నారు. జాతీయ స్థాయిలో 108 అవార్డులను అందుకోవడం ఏపీ పోలీస్ పనితీరుకు కొలమానం అన్నారు. రాష్ట్రంలో పారదర్శకంగా, అంకితభావంతో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ఐఐడిటి, ఏపిఎస్ఎస్డిసిలతో అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ)లు కుదుర్చుకోవడం రాష్ట్ర పోలీసు చరిత్రలో ఓ మైలు రాయి వంటిదని డీజీపి గౌతం సవాంగ్ అభివర్ణించారు. మంగళవారం స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఇగ్నైట్ - 2020 వేదికపై ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ డిజిటల్ టెక్నాలజీస్ (ఐ.ఐ.డి.టి), ఏ.పి స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఏ.పి.ఎస్.ఎస్.డి.సి) లాంటి ప్రతిష్టాత్మక సంస్థలతో డి.జి.పి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
ఐ.ఐ.డి.టి జనరల్ మేనేజర్ డా.మల్లికార్జున రెడ్డి, ఏ.పి.ఎస్.ఎస్.డి.సి ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ డా.ఎం.డి.వి రామ కోటి రెడ్డి లతో ఇగ్నైట్ -2020 వేదికపై ఒప్పందాలపై సంతకాలు చేశారు. వృత్తిపరమైన నైపుణ్యం పెంపొందించుకునేందుకు ఇలాంటి ఒప్పందాలు పోలీసు సిబ్బందికి దోహదపడుతుందని డి.జి.పి ఆకాంక్షించారు. రోజురోజుకు పెరుగుతున్నసాంకేతిక పరిజ్ఞానం నేపథ్యంలో దానిని అందిపుచ్చుకునేందుకు పోలీసులు ప్రతిక్షణం తపన, జిజ్ఞాసతో నేర్చుకోవడానికి ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ప్రయత్నిస్తూ ఉండాలని డి.జి.పి పేర్కొన్నారు. అది ఐ.ఓ.టి (ఇంటర్ నెట్ అఫ్ థింగ్స్ ) కానీ లేదా ఇతరత్రా సాంకేతిక పరిజ్ఞానమైనా నెరపరిశోధనలో భాగంగా నేర్చుకోవాల్సిన భాద్యత పోలీసు శాఖ పై ఉందన్నారు. ప్రజల్లో భద్రత పై భరోసా కల్పించేందుకు, శాంతిభద్రతల పర్యవేక్షణలో ఇలాంటి ముందడుగు ఒక అవసరమని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు వచ్చే ప్రమాదమూ లేకపోలేదని..పరిజ్ఞానం వినియోగించుకోవడంలో కూడా సిబ్బంది నైపుణ్యాన్ని పెంచడం ముఖ్యమైన అంశంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలకు తాము ఆదర్శంగా నిలిచామన్నారు. గత సంవత్సర కాలంలో నూతనత్వాన్ని ఆవిష్కరించడంలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో 108 అవార్డులు సాధించడం రాష్ట్ర పోలీసు శాఖకు గర్వకారణమన్నారు. కీలకమైన ఇంటర్-ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టం (ఐసిజెఎస్)లో దేశంలో రెండో స్థానంలో నిలవడం జరిగిందన్నారు. దర్యాప్తులో కీలకమైన వేలిముద్రలను సేకరించడంలో శాస్త్రీయ పద్ధతులు అవలంబించినందుకు దేశంలో ప్రధమ స్థానంలో నిలవడం గర్వంగా ఉందన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, వృత్తిపరంగా సామర్ధ్యం పెంపొందించుకుంటే ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు వీలవుతుందన్నారు. కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులతో ముచ్చటించారు. సీనియర్ పోలీసు ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!