కోవిడ్-19 క్వారంటైన్: కొత్త నిబంధనలు విడుదల చేసిన దుబాయ్

- January 06, 2021 , by Maagulf
కోవిడ్-19 క్వారంటైన్: కొత్త నిబంధనలు విడుదల చేసిన దుబాయ్

దుబాయ్:కోవిడ్ 19 బాధితులతో సన్నిహితంగా మెలిగినవారు, ఎలాంటి లక్షణాలూ లేకపోయినాసరే 10 రోజులు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో వుండాలని దుబాయ్ హెల్త్ అథారిటీ స్పష్టం చేసింది. కోవిడ్ బాధితులతో 2 మీటర్ల దూరాన్ని పాటించినాసరే, 15 నిమిషాలు వారికి ఆ దూరంలో వుంటే, హోం క్వారంటైన్ తప్పనిసరి. 10 రోజుల్లోగా కోవిడ్ లక్షణాలు ఏమైనా బయటపడితే, వెంటనే టెస్ట్ చేయించుకోవాలని అధికారులు స్పష్టం  చేశారు. కోవిడ్ పేషెంట్‌గా నిర్థారింపబడటానికి రెండు రోజుల ముందు సదరు వ్యక్తిని కలిసి, తగినంత సమయం ఆ వ్యక్తితో కలిసి వున్నప్పటికీ ‘క్లోజ్ కాంటాక్ట్’ గానే గుర్తిస్తారు. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినవారికి, జ్వరం తగ్గాక, తిరిగి జ్వరం రాకపోతే 24 గంటల వ్యవధిలో రెండుసార్లు పిసిఆ్ టెస్ట్ చేసి, ఆ తర్వాత మాత్రమే వారిని డిశ్చార్జి చేయడం జరుగుతుంది. 3 రోజుల పాటు జ్వరం లేకపోవడం, పల్మనరీ ఇమేజింగ్‌లో సమస్యలు లేకపోవడం వంటివాటిని పరిగణనలోకి తీసుకుని డిశ్చార్జిపై నిర్ణయం తీసుకుంటారు. ఏడు రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్ తర్వాత, మరో రెండు వారాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుంది. ఏవైనా సమస్యలు తలెత్తితే తిరిగి వైద్యులను సంప్రదించాల్సి వుంటుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com