బ్రిటన్:ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా
- January 06, 2021
లండన్:బ్రిటన్ లో కరోనా కేసులు రోజు రోజుకు భారీ స్థాయిలో పెరిగిపోతున్నాయి. పోసిటివ్ కేసులు పెరుగుతుండటంతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెద్ద సంఖ్యలో పెరుగుతున్నది. పాత వైరస్ తో పాటుగా బ్రిటన్ లో కొత్త స్ట్రైన్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజుకు 50 నుంచి 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రస్తుతం లాక్ డౌన్ ను విధించారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ఇక ఇదిలా ఉంటె,బ్రిటన్ లో కరోనా కేసుల వివరాలపై ఓ సర్వేను నిర్వహించారు. ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. దేశంలో ప్రతి 50 మందిలో ఒకరికి కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది. అలానే, లండన్ లో ప్రతి 30 మందిలో ఒకరికి కరోనా వైరస్ సోకినట్లు సర్వేలో నిర్ధారణ జరిగింది. వైరస్ బారిన పడినప్పటికీ లక్షణాలు లేని వ్యక్తులను గురించే క్రమంలో ఈ షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
తాజా వార్తలు
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!