దుబాయ్ డ్యూటీ ఫ్రీ లక్కీ డ్రాలో రూ.7.3 కోట్లు గెలుచుకున్న హైదరాబాదీ

- January 07, 2021 , by Maagulf
దుబాయ్ డ్యూటీ ఫ్రీ లక్కీ డ్రాలో రూ.7.3 కోట్లు గెలుచుకున్న హైదరాబాదీ

దుబాయ్:'దుబాయ్ డ్యూటీ ఫ్రీ' లక్కీ డ్రా లో హైదరాబాద్ వ్యక్తికి అదృష్టం వరించింది.హైదరాబాద్ కు చెందిన కనికరన్ రాజశేఖర్(45) లక్కీ డ్రాలో $1 మిలియన్ డాలర్లు(రూ.7.3 కోట్లు)నగదు బహుమతి గెలుచుకున్నాడు.రాజశేఖర్ గెలుచుకున్న టికెట్ నంబర్ 3546 ను మిలీనియం మిలియనీర్ సిరీస్ 347 లో డిసెంబర్ 18 న ఆన్‌లైన్‌లో కొనుగోలు చేశాడు.తాను రెండుసార్లు మాత్రమే DDF టికెట్ కొన్నానని, మొదటిది గత నెల అని, ఇది తన అదృష్టానికి రెండవ ప్రయత్నం అని, అతను విజేతగా వచ్చాడని చెప్పాడు.

ఈ మొత్తంతో తన కష్టాలు తీరిపోతాయని రాజశేఖర్ అన్నాడు.హైదరాబాద్ లో ఓ విల్లా కొని మిగతా డబ్బును పిల్లల భవిష్యత్తు కోసం...ఇంకా వ్యాపారానికి వినియోగిస్తానని ఆయన తెలిపాడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com