దేశంలోనే మొట్టమొదటి రోడ్ సేఫ్టీ చెక్ పోస్టులు-సీపీ సజ్జనార్
- January 08, 2021
హైదరాబాద్:ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం వల్లనే రోడ్డు ప్రమాదాలు అధికం అవుతున్నాయని, రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ముఖ్య ఉద్దేశంతోనే చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు. శుక్రవారం షాద్ నగర్ నియోజకవర్గం నేషనల్ హైవే -44 లోని రాయికల్ టోల్ ప్లాజా వద్ద, పటానిచెరువు ఇక్రిశాట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన దేశంలోనే మొట్టమొదటి రోడ్డు సేఫ్టీ చెక్ పోస్ట్ ల ను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, డీసీపీ మాదాపూర్ వెంకటేశ్వర్లు, డీసీపీ శంషాబాద్ ప్రకాష్ రెడ్డి, ఐపీ ఎస్., డిసీపీ ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... రోడ్డు ప్రమాదాల వల్ల చాలా మంది చనిపోతున్నారని, షాద్ నగర్ పరిధిలో గత మూడు సంవత్సరాల నుంచి సుమారుగా 400 మంది చనిపోవడం జరిగిందని, వెయ్యి మంది వరకు గాయాలపాలయ్యారని ఆయన అన్నారు. రోడ్లపై ప్రయాణించే ప్రయాణికులు సరైన అవగాహన లేకుండా వాహనాలను నడుపుతున్నారని, ముఖ్యంగా హెల్మెట్ లేకుండా, వ్యతిరేక రూట్లలో వాహనాలు నడిపే వారి వల్లనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మైనర్ యువతీ యువకులకు వాహనాలు ఇవ్వడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని అలాంటి వారికి వాహనాలు ఇవ్వద్దని వాహనదారులను హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి, రోడ్డు భద్రత కోసం 24 గంటలు పని చేస్తుందని అన్నారు. దేశంలోనే మొట్టమొదటి చెక్ పోస్ట్ ఇక్కడ ఏర్పాటు చేశామని కమిషనర్ పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించడానికి కృషి చేస్తున్న ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్ ను, ఏసిపి విశ్వప్రసాద్ ను, షాద్ నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రవి కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. రోడ్డు భద్రత కోసం పోలీసులకు సహకరిస్తున్న జిఎంఆర్ యాజమాన్యాన్ని, ఇంచార్జ్ ఇబ్రహీం ను కమిషనర్ అభినందించారు.
షాద్ నగర్ రాయికల్ టోల్ గెట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ కార్యక్రమంలో ట్రాఫిక్ డిసిపి విజయ్ కుమార్, ఏసీపీ విశ్వ ప్రసాద్, షాద్ నగర్ ఏసిపి కుషాల్కర్, సీఐ శ్రీధర్ భూపాల్, ట్రాఫిక్ ఎస్ఐ రఘు కుమార్, డివిజన్ సీఐలు, ఎస్ఐలు కానిస్టేబుల్స్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆర్ సీ పురం పీ ఎస్ లిమిట్స్ లోని పటాన్ చెరువు టోల్ గేటు ఇక్రిశాట్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ ఎస్ ఎమ్ విజయ్ కుమార్, ఐపీఎస్., మాట్లాడుతూ జరిమానాలు, చాలనాలు విధించడం తమ ఉద్దేశం కాదని, ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ఈ చెక్ పోస్టుల ఉద్దేశమన్నారు. ప్రజలందరూ తప్పక హెల్మెట్ ధరించాలన్నారు. హెల్మెట్ లేని కారణంగా 75 శాతం మరణాలు సంభవిస్తున్నాయన్నారు. అందరూ తప్పక ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు, మియాపూర్ ఏసీపీ క్రిష్ణ ప్రసాద్, మాదాపూర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, ఆర్సీ పురం ఇన్ స్పెక్టర్ జగదీశ్వర్, మియాపూర్ ఇన్ స్పెక్టర్ వెంకటేష్, మియపూర్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ సుమన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!